నైజాంలో దూసుకెళ్తున్న నాగచైతన్య

నైజాంలో దూసుకెళ్తున్న నాగచైతన్య

నాగచైతన్య హీరోగా నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా వినాయక చవితి రోజైన సెప్టెంబర్ 13 వ తేదీన రిలీజ్ అయింది.  క్రిటిక్స్ పరంగా యావరేట్ అనిపించుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా మంచి వసూళ్లను సాధిస్తున్నది.  ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా వసూళ్లు బాగున్నాయి.  మొదటి వారం ముగిసేనాటికి శైలజా రెడ్డి అల్లుడు నైజాంలో రూ.3.75 కోట్లు షేర్ వసూలు చేసింది.  ఈ శుక్రవారం రోజున కొత్త సినిమాలు రిలీజైనా.. సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే మినహా మిగతా సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. శైలజారెడ్డి అల్లుడు కలెక్షన్లకు ఢోకా లేదనిపిస్తున్నది.  నైజాంలోని బిసి సెంటర్స్ లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో సినిమా వసూళ్లు బాగానే వస్తున్నాయి.  పూర్తి స్థాయిలో వసూళ్ల వివరాలు తెలియాలంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే.