ట్రైలర్ టాక్: అత్తా.. భార్య ఇగోల మధ్య నలిగే అల్లుడు

 ట్రైలర్ టాక్:  అత్తా.. భార్య ఇగోల మధ్య నలిగే అల్లుడు

దర్శకుడు మారుతి కొత్త కొత్త పాయింట్ లను ఎంచుకొని సినిమాలు చేస్తుంటాడు.  భలేభలే మగాడివోయ్ లో మతిమరుపును, మహానుభావుడులో అతి శుభ్రత అనే పాయింట్ ను ఆధారంగా చేసుకొని, దానికి తనదైన శైలిలో కామెడీ స్క్రీన్ ప్లేను అటాచ్ చేసి సినిమాలు చేశాడు.  రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  

ఇప్పుడు ఇగోను ప్రధానాంశంగా చేసుకొని నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధానపాత్రలో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది.  ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకునే పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు.  ప్రేమించిన ప్రతి దాని వెనుక ఓ కష్టం ఉంటుంది అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమౌతుంది.  ట్రైలర్ ఓపెనింగ్ షాట్ చాలా స్టైలిష్ గా ఉన్నది.  కష్టాన్ని తట్టుకుంటే లైఫ్ కలర్ ఫుల్ గా ఉంటుంది అని చెప్పించి సినిమా ఎలా కలర్ ఫుల్ గా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు.  పుట్టినపుడు ఒకరిని డాడీరూపంలో, ప్రేమించడానికి ఒకరిని అను రూపంలో, పెళ్లి జరగడానికి ఒకరిని అత్తరూపంలో పుట్టించి లైఫ్ ను గట్టిగా తొక్కేశాడు అనే డైలాగ్ లు సినిమాలో ఈ మూడు పాత్రలు ఎంత ముఖ్యమైనవో శాంపిల్ గా చూపించాడు.  తల్లి కూతుర్లయినా రమ్యకృష్ణ, అను ఇమ్మానుయేల్ లకు ఉన్న ఇగోకు వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్ ఎలా బలయ్యారో చూపిస్తూ కామెడీ ఎలా ఉండబోతున్నాడో రుచి చూపించాడు.  అనుకు భర్తగా, రమ్యకృష్ణకు అల్లుడిగా వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు నాగచైతన్య ఎలా పాట్లు పడ్డాడో ఈ సినిమాలో చూపించబోతున్నారు.  మొత్తానికి ట్రైలర్ ఓ పసందైన విందు భోజనంలా ఉంది.