తొలిరోజు దంచికొట్టిన నాగ చైతన్య !

తొలిరోజు దంచికొట్టిన నాగ చైతన్య !

నాగ చైతన్య తాజా చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' నిన్ననే థియేటర్లలోకి వచ్చింది.  ముందు నుండి భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమా మొదటిరోజు భారీ వసూళ్లను రాబట్టుకుంది.  ట్రేడ్ వర్గాల లెక్కలు మేరకు ఏపి, తెలంగాణల్లో కలిపి ఈ సినిమా 5.6 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టు తెలుస్తోంది.  

అత్యధికంగా నైజాం ఏరియాలో 1.7 కోట్లు ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం సీడెడ్లో 84 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 77 లక్షలు, వెస్ట్ గోదావరిలో 47 లక్షలు, గుంటూరులో 64 లక్షలు, నెల్లూరులో 22 లక్షలు, కృష్ణాలో 40 లక్షలు, ఉత్తరాంధ్రలో 77 లక్షలు వసూలు చేసింది.  మారుతి దర్శకత్వంలో రూపొండిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.