నైజాంలో నాగ చైతన్య హవా !

నైజాంలో నాగ చైతన్య హవా !

సినిమా సినిమాకి నాగ చైతన్య మార్కెట్ రేంజ్ పెరుగుతోంది.  అందుకు సాక్ష్యం ఆయన కొత్త చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' సాధించిన ఓపెనింగ్స్.  గత గురువారం విడుదలైన ఈ సినిమా మొదటిరోజే 5.6 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం నైజాం ఏరియాలో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. 

తొలిరోజు గురువారం 33 లక్షలు షేర్ అందుకున్న ఈ సినిమా 2న రోజు 23 లక్షలు, 3 వరోజు శనివారం 26 లక్షలు, నాల్గవ రోజు ఆదివారం 30 లక్షల షేర్ అందుకుని మొత్తంగా 1.12 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.  ఈ సినిమాతో నాగ చైతన్య నైజాం మార్కెట్ పెరిగిందనే చెప్పొచ్చు.