సైనాకు స్పెషల్‌ గిఫ్ట్‌...

సైనాకు స్పెషల్‌ గిఫ్ట్‌...

ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో హైదరాబాద్ స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్‌ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్‌కు ఆమె తండ్రి హర్వీర్‌ సింగ్ బంగారు ఉంగరంను స్పెషల్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ మేరకు సైనా తన ట్విటర్‌ ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. 'ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచినందుకు నాన్న నాకు ఇచ్చిన స్పెషల్‌ గిఫ్ట్‌. థ్యాంక్యూ నాన్న' అని సైనా తన ట్విటర్‌లో పేర్కొంది.