సాయంత్రం సైనా వెడ్డింగ్ రిసెప్షన్

సాయంత్రం సైనా వెడ్డింగ్ రిసెప్షన్

గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న భారత ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 14న హైదరాబాద్‌లో వీరిద్దరు రిజిస్టర్‌  వివాహం చేసుకున్నారు. పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఈ రోజు సైనా నెహ్వాల్, కశ్యప్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. మాదాపూర్ లోని నోవాటెల్ హోటల్ (కన్వెన్షన్ హాల్ 4) లో సాయంత్రం 6.30 నుండి వెడ్డింగ్ రిసెప్షన్ ప్రారంభమవనుంది. ఈ రిసెప్షన్ కు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మెగాస్టార్ చిరంజీవి, కోచ్ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తదితర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.