సైనా ఫిట్నెస్ ఛాలెంజ్ ఏంటో తెలుసా?

సైనా ఫిట్నెస్ ఛాలెంజ్ ఏంటో తెలుసా?

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వెరైటీ ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరింది. ఈ ప్రపంచాన్ని ఆరోగ్యధామంగా  మారుద్దామని, అందుకోసం 36 సెకండ్లపాటు ప్లాంక్ మీద ఉండాలని సవాల్ విసిరింది. ప్లాంక్ మీద ఎలా ఉండాలో చేసి చూపించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అలా 36 సెకండ్ల పాటు ప్లాంక్ చేస్తే బజాజ్ అలయాన్జ్ వారు హృద్రోగ బాలల వైద్య ఖర్చులు భరిస్తారని ట్వీట్ చేసింది. అలాగే తన చాలెంజ్ ను అందుకోవాలని కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ తో పాటు పలువురు క్రీడాకారులకూ సవాల్ విసిరింది సైనా.