సెప్టెంబ‌ర్‌లో సైనా బ‌యోపిక్‌ మొద‌లు

సెప్టెంబ‌ర్‌లో సైనా బ‌యోపిక్‌ మొద‌లు

బ్యాడ్మింట‌న్ క్వీన్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ గురించి గ‌త కొంత‌కాలంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సైనా పాత్ర‌లో `సాహో` ఫేం శ్ర‌ద్ధాక‌పూర్ న‌టించ‌నుంది అన‌గానే అంద‌రిలోనూ ఒక‌టే ఆస‌క్తి. క్రీడాభిమానుల్లో సైనాకి ఉన్న ఫాలోయింగ్ అమోఘం. సినీనాయిక‌గా శ్ర‌ద్ధాకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతే గొప్ప‌ది. ఈ రెండు కార‌ణాల దృష్ట్యా ఈ బ‌యోపిక్‌కి క్రేజు అంత‌కంత‌కు పెరుగుతోంది. సైనా బ‌యోపిక్ కోసం ఇదివ‌ర‌కూ హైద‌రాబాద్‌లో శ్ర‌ద్ధాక‌పూర్ బ్యాడ్మింట‌న్‌ ప్రాక్టీస్ చేసిన సంగ‌తి తెలిసిందే. సైనా బ్యాట్ ఎలా ప‌ట్టుకుంటుంది.. ఎలా ఝ‌లిపిస్తుంది.. ఆట‌లో త‌న క‌ద‌లిక‌లు ఎలా ఉంటాయి? త‌దిత‌ర విష‌యాల్ని శ్ర‌ద్ధా బాగా స్ట‌డీ చేసింది. 

ప్ర‌స్తుతం మరోసారి సెకండ్ స్పెల్ ప్రాక్టీస్‌ని శ్ర‌ద్ధా ప్రారంభించిందిట‌. బ్యాడ్మింట‌న్ ఆడాలంటే ముందుగా చాలా ప్రిప‌రేష‌న్ అవ‌స‌రం. బాడీ ఫిట్‌గా ఉండాలి. అందుకే ఇప్పుడు ప్రాక్టీస్ తిరిగి ప్రారంభించిందిట‌. ఈ సినిమాని ఆమోల్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో టీసిరీష్ భూష‌ణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. హిందీ మీడియం, గులాబ్ గ్యాంగ్ చిత్రాల ర‌చ‌యిత అమితోష్ నాగ్‌పాల్ స్క్రిప్టు అందిస్తున్నారు. అన్ని బ‌యోపిక్‌ల త‌ర‌హాలోనే ఈ చిత్రంలోనూ ఎమోష‌న్స్‌కి స్క్రిప్టులో పెద్ద పీట వేశార‌ట‌. సెప్టెంబ‌ర్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.