ఉమెన్స్ డే: అదరగొట్టిన ‘సైనా’ ట్రైల‌ర్

ఉమెన్స్ డే: అదరగొట్టిన ‘సైనా’ ట్రైల‌ర్

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ సినిమా ‘సైనా’ ట్రైల‌ర్ రిలీజైంది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా నేడు విడుదల చేశారు. ఓ స్పోర్ట్స్ డ్రామాకు కావాల్సిన అన్ని హంగుల‌తో సైనా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ‘దారిలో వెళ్ల‌డం ఒకటైతే దారి చూప‌డం అనేది మ‌రొక‌టి.. నువ్వు ఆ రెండోదానిపై దృష్టి సారించు’ అని సైనాకు త‌న త‌ల్లి చెప్పే మాట‌ల‌తో ట్రైలర్‌ ప్రారంభం కాగా సైనా పాత్ర‌లో ప‌రిణీతి నటనతో ఆకట్టుకుంది. ‘చైనా వాల్‌ను బ‌ద్ధ‌లు కొడ‌తా’ అంటూ యంగ్ సైనా చెప్పే డైలాగ్ ఈ ట్రైల‌ర్‌కు హైలైట్ గా నిలిచాయి. సైనా పాత్ర‌లో ప‌రిణీతి చోప్రా కనిపించిన తీరు అచ్చం సైనాకు ఏ మాత్రం తక్కువ కానంతగా ఒదిగిపోయింది. కాగా సైనా లాంటి ఫిట్నెస్ సాదించేందుకు ప‌రిణీతి చోప్రా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ చిత్రానికి అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ ఫిలింస్, ఫ్రంట్ ఫుట్ పిక్చర్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అమాల్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 26న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.