సాత్విక్‌ కేసులో ఎందుకీ నిర్లక్ష్యం..?

సాత్విక్‌ కేసులో ఎందుకీ నిర్లక్ష్యం..?

మాచర్లకు చెందిన చిన్నారి సాయి సాత్విక్ మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించినట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాలో ఉన్నది సాత్వికేనన్న నిర్ధారణకు రాకుండా కిడ్నాప్‌ జరిగిందంటూ మీడియాకి విజువల్స్‌తోపాటు ఫొటోలను పోలీసులు విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాత్విక్‌ కిడ్నాప్‌కు గురికాలేదని, ఇంటి ముందు ఆడుకుంటూ ఇంటికి 400 మీటర్ల దూరంలో ఉన్న క్వారీ గుంటలో ప్రమాదవశాత్తూ పడిపోయి చనిపోయాడని ఇవాళ ప్రకటించారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఓ వ్యక్తి భుజాలపై ఉన్న బాలుడిని సాత్విక్‌ అనుకున్నామని పోలీసులు చెప్పారు. పోలీసులే ఇలా గందరగోళం సృష్టించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో సాత్విక్‌ పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారంది. సాత్విక్‌ మృతి విషయం తెలియడంతో బాలుడి కుటుంబసభ్యులు గుండెలవిసేలా కన్నీరుమున్నీరవుతున్నారు.