నిమ్మగడ్డలో ఫ్యాక్షనిస్ట్‌ ధోరణి కనిపిస్తోంది : సజ్జల

నిమ్మగడ్డలో ఫ్యాక్షనిస్ట్‌ ధోరణి కనిపిస్తోంది : సజ్జల

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత హీటేక్కుతున్నాయి. సుప్రీం కోర్టు ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. నిమ‌్మగడ్డ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా నిమ్మగడ్డపై  సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మలా మారారని... ఎన్నికల కమిషనర్ కీలుబొమ్మలా వ్యవహరించడం దురదృష్టకరమని సజ్జల రామకృష్ణ ఫైర్‌ అయ్యారు. నిమ్మగడ్డలో ఫ్యాక్షనిస్ట్ ధోరణి కనిపిస్తోందని... రిటైర్డ్ అధికారిఅయ్యి ఉండి ఇతర అధికారులపై  వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని సజ్జల పేర్కొన్నారు.  ఎత్తుకు పైఎత్తు వేస్తూ చవకబారు ధోరణిలోనే నిమ్మగడ్డ వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నిక విధులను నిమ్మగడ్డ దుర్వినియోగం చేస్తున్నారని.. తన పరిధిలో లేని అంశాలను ప్రస్తావిస్తూ అధికారులపై చర్యలకు నిమ్మగడ్డ లేఖ రాశారని ఆయన ఆరోపణలు చేశారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని.. ఎన్నికల్లో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు.