మిస్టర్ కూల్ భార్య ... ఓ రేంజ్ లో ఫైర్ ...

మిస్టర్ కూల్ భార్య ... ఓ రేంజ్ లో ఫైర్ ...

కరోనా నివారణ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు... వివిధ రాష్ట్రాలు నివారణ చర్యలు చేపట్టాయి. ఇక ఈ విపత్కర సమయంలో అంతా ప్రభుత్వాలకు అండగా వుంటున్నారు. ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు సైతం భారీ మొత్తం విరాళంగా ఇస్తున్నారు. ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్, మిస్త్ర కూల్ మహేంద్రసింగ్ ధోనీ.. లక్షలు రూపాయలు మాత్రమే ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై నెటిజన్లు అయితే ధోనీని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. అయితే ఇవి కాస్త ధోనీ భార్య సాక్షికి తీవ్ర ఆగ్రహం తెపించాయి. సోషల్ మీడియా లో ఈ వ్యవహారంపై స్పందించిన ఆమె... నిప్పులు చెరిగింది. ఇలాంటి సున్నిత సమయాల్లో తప్పుడు వార్తలు ప్రచురించడం మానేయాలని మీడియా సంస్థలకు సూచించింది. బాధ్యతాయుతమైన జర్నలిజం అదృశ్యమైనందుకు ఆశ్చర్యం వేస్తోందన్న సాక్షి.. సిగ్గు అనిపించడం లేదూ.. అని ప్రశ్నించింది. కానీ, కరోనా విషయంలో ధోనీ కచ్చితంగా ఎంత ప్రకటించాడన్న విషయాన్ని మాత్రం సాక్షి వెల్లడించలేదు. అయితే.. పూణెలోని ముకుల్ మాధవ్ ఫౌండేషన్‌కు క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ కెట్టో ద్వారా ధోనీ లక్ష రూపాయల విరాళం అందించాడు. క్రికెట్, ప్రకటనలు, వ్యాపారం... ఇలా కోట్ల రూపాయలు సంపాదించిన ధోని.. లక్ష రూపాయల విరాళం ప్రకటించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.