ధోని రిటైర్మెంట్‌పై సాక్షి ఎమోష‌న‌ల్ పోస్ట్‌

ధోని రిటైర్మెంట్‌పై సాక్షి ఎమోష‌న‌ల్ పోస్ట్‌

అంత‌ర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న‌ట్టు ధోని ప్ర‌క‌టించ‌గానే ఒక్క‌సారి క్రీడా లోకం మూగ‌పోయింది. టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత  ధోని రిటైర్ అవుతారేమోన‌ని అంద‌రు భావిస్తున్న త‌రుణంలో....తాను రిటైర్ అయ్యే స‌మ‌యం అయింద‌ని ప్ర‌క‌టించాడు మ‌హీ. ధోని రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆయ‌న పేరు మారు మ్రోగిపోయింది. ధోని రిటైర్మెంట్ పై చాలా మంది ప్రముఖులు, ఫ్యాన్స్ స్పందించారు. ఈ నేపథ్యంలో..  ధోనీ భార్య సాక్షి ఒక ఎమోష‌న‌ల్ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "మీరు సాధించిన విజయాలను చూసి గర్వపడాలి. రిటైర్మెంట్‌ ప్రకటించినందుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలను చూసి నేను గర్విస్తున్నాను. మీకిష్టమైన ఆటకు గుడ్‌బై చెప్పే క్రమంలో మీరు పడిన మనోవేదన నాకు తెలుసు. కన్నీళ్లను దిగమింగుకొని రిటైర్మెంట్‌ ప్రకటించారని అనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలు, చేసిన పనిని ప్రజలు మర్చిపోతారేమో కానీ, వాళ్లకు అందించిన అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేరు" సాక్షి పేర్కొన్నారు.