తన భర్త ఎలాంటివాడో చెప్పిన సాక్షి ధోని... 

తన భర్త ఎలాంటివాడో చెప్పిన సాక్షి ధోని... 

ఈ రోజు ధోని పుట్టిన రోజు సందర్బంగా భారత ఆటగాళ్లు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అదే తరహాలో సాక్షి ధోని కూడా కొంచెం వింతగా తన  భర్త ఎలాంటివాడో తెలుపుతూ ధోనికి శుభాకాంక్షలు తెలిపారు.  'నీ పుట్టిన రోజు గుర్తు చేసుకుంటూనే ఓ ఏడాది గడిచింది. ఈ సంవత్సర కాలంలో వయసు తప్ప మరే విషయం మారలేదు. అయితే నువ్వు ఏ విధమైన వ్యక్తివి అంటే... నువ్వు  శుభాకాంక్షలకు,  బహుమతులకు లోగేవాడివి కాదు. ఈ విషయం లో నువ్వు కొంచెం మారాలి. ఇక క్యాండిల్ వెలిగించి కేకు కోసి ని జీవితం లోని కొత్త ఏడాదిని సెలబ్రేట్‌ చేసుకుందాం. హ్యాపీబర్త్‌డే ధోనీ' అని అంటూ తెలిపింది.