రిలీజ్ డేట్ మార్చుకున్న సాక్ష్యం

రిలీజ్ డేట్ మార్చుకున్న సాక్ష్యం

తెలుగు యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'సాక్ష్యం'. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతోంది. మొదటగా జూన్ 14న రిలీజ్ చేయాలనీ భావించినా సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్ట్ పోనే చేశారు. జూలై ఆరంభానికి ఫస్ట్ కాపీ రెడీ కానుండడంతో జూలై 20 తేదీ రిలీజ్ చేయాలనీ చిత్రబృందం ఖరారు చేసింది. 

కథ పరంగా భారీ సినిమా కావడం హైదరాబాద్, పోలాచ్చి, వారణాసి, దుబాయ్, హైదరాబాద్ ఇలా అయిదుచోట్ల భారీ షెడ్యూళ్లు ప్లాన్ చేయడంతో కాస్త ఆలస్యం అయ్యింది. సినిమాలో దాదాపు ఐదు భారీ ఫైట్లు ఉండడంతో వాటికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. ఇక జూన్ లో కూడా సమ్మోహనం, నా నువ్వే, కాలా సినిమాలు రిలీజ్ కానుండడంతో జూలై అయితే సేఫ్ అని భావించారట. ఇదివరకే రిలీజ్ చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ నిర్మించారు.