సమంతకు 'శాకుంతలం' బృందం శుభాకాంక్షలు!

సమంతకు 'శాకుంతలం' బృందం శుభాకాంక్షలు!

స్టార్ హీరోయిన్ సమంత తొలి తెలుగు సినిమా 'ఏమాయ చేసావె' విడుదలై ఇవాళ్టికి పదకొండు సంవత్సరాలు పూర్తవుతుంది. 2010 ఫిబ్రవరి 26న ఆ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. అంతే కాదు... హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంత నిజజీవితంలోనూ ఒక్కటి కావడానికి బీజం వేసింది. ఈ సందర్భంగా నటిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమంతను 'శాకుంతలం' చిత్ర బృందం అభినందించింది. ఆమెలో కలిసి పనిచేయబోతుండటం ఆనందంగా ఉందని దర్శకుడు గుణశేఖర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. సమంత శకుంతలగా నటించబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది దర్శకుడు గుణశేఖర్ ప్రకటించాల్సి ఉంది.