జాతి రత్నాలు: ఫరియా ఎత్తుకు ఫ్లాట్ అయిన ప్రభాస్

జాతి రత్నాలు: ఫరియా ఎత్తుకు ఫ్లాట్ అయిన ప్రభాస్

‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే’ పాటతో ఒక్కసారిగా సినీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది హైదరాబాదీ ఫరియా అబ్దుల్లా. యూట్యూబర్ గా రాణిస్తున్న ఫరియా తాజాగా న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న ‘జాతి ర‌త్నాలు’ సినిమాలో నటించింది. ఈ చిత్రంతో తన క్యూట్ లుక్స్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ‘జాతి ర‌త్నాలు’ ట్రైలర్ విడుదల కాగా, ఈ ట్రైలర్ విడుదల కోసం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ను ముంబై లో కలిశారు. ఈ సందర్బంగా వారితో సరదాగా కాసేపు గడిపారు. ‘జాతి ర‌త్నాలు’ హీరోయిన్ ఫరియాను చూసిన ప్రభాస్.. ‘ఈవిడ ఏంటి..? ఇంత పొడవు వుంది. నిజమేనా, ఏమైనా హీల్స్ వేసిందా..!? అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది.