హెరిటేజ్‌ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి

హెరిటేజ్‌ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌ కంపెనీ షేర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఏపీ ఎన్నికల్లో ప్రారంభం ట్రెండ్స్‌లో టీడీపీ వెనుకంజలో ఉండటంతో ఆ కంపెనీ షేర్‌పై ఒత్తిడి పెరిగింది. బుధవారం రూ. 475 వద్ద ముగిసిన హెరిటేజ్‌ షేర్‌ ఇవాళ ఓపెనింగ్‌లోనే పది శాతంపైగా నష్టపోయి రూ. 411కి పడిపోయింది. తరవాత కోలుకుని ఇపుడు రూ. 453 వద్ద ట్రేడవుతోంది. ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ కౌంటర్‌ బాగా ప్రభావం చూపుతోంది.