ఆ హాలీవుడ్ నటి లక్ష్మీదేవిని పూజించడం వెనుక అసలు కారణం...!!

ఆ హాలీవుడ్ నటి లక్ష్మీదేవిని పూజించడం వెనుక అసలు కారణం...!!

భారతదేశంలో హిందువులు లక్ష్మీదేవిని సంపదకు చిహ్నంగా కొలుస్తారు.  ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ప్రతిమ తప్పనిసరిగా ఉంటుంది. హిందూ మతాన్ని, హిందువుల ఆచారాలను, హిందూ దేవుళ్లను ఆరాధించే వ్యక్తులు విదేశాల్లోనూ కోకొల్లలుగా ఉన్నారు. అటువంటి వారిలో హాలీవుడ్ నటి సల్మా హాయక్ ఒకరు.  ఆమె తన ఇంట్లో నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తుందట.  ఈ విషయాన్ని సల్మా హాయక్ స్వయంగా ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.  ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మీదేవిపైనే దృష్టి పెడతానని పేర్కొన్నది.  డీప్ గా మెడిటేషన్ చేస్తూ, అంతఃసౌందర్యంతో అనుసంధానం అయ్యే సమయంలో లక్ష్మీదేవిపై దృష్టి పెడతానని సల్మా హాయక్ తెలిపింది.  అందరూ లక్ష్మీదేవిని సంపదకు, అదృష్టానికి, ఆనందానికి చిహ్నంగా పూజిస్తారని, తనకు మాత్రం లక్ష్మీదేవి రూపం సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తోందని సల్మా హాయక్ తెలిపారు.  మెక్సికోలో జన్మించిన హాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి మెప్పించిన సల్మా ప్రపంచంలో 100 మంది సెక్సియస్ట్ మహిళల జాబితాలో 8 వ స్థానం సంపాదించింది.