ఫామ్ హౌస్ లో సల్మాన్ రొమాన్స్... మాములుగా లేదుగా...!!

ఫామ్ హౌస్ లో సల్మాన్ రొమాన్స్... మాములుగా లేదుగా...!!

సల్మాన్ ఖాన్ గత ఏడు వారాలుగా తన ఫామ్ హౌస్ లోనే ఉండిపోయాడట. లాక్ డౌన్ కు ముందు ఫామ్ హౌస్ కు వచ్చిన సల్మాన్, అతని స్నేహితురాలు, హీరోయిన్ జాక్వెలిన్ అక్కడే ఉన్నారు.  లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతు సహకారంగా సల్మాన్ నిత్యవసర వస్తువులను అందించారు.  ఆ తరువాత అక్కడే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు.  

ఇటీవలే జాక్వెలిన్ ఓ వీడియోను చేసింది.  సల్మాన్ ఫామ్ హౌస్ లో ఓ రోజు అని చెప్పి వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  తరువాత ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఓ వీడియోను రూపొందించాడు.  తేరేబినా అనే రొమాంటిక్ సాంగ్ ను ఫామ్ హౌస్ లో షూట్ చేసి రిలీజ్ చేశారు.  సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఈ సాంగ్ లో నటించి మెప్పించారు.  మొత్తం ఫామ్ హౌస్ లోనే ఈ సాంగ్ షూట్ చేయడం విశేషం.  ఇప్పుడు ఈ రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.