ట్రెండ్ అవుతున్న సల్మాన్ దబాంగ్ లుక్

ట్రెండ్ అవుతున్న సల్మాన్ దబాంగ్ లుక్

సల్మాన్ కు బాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది.  ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో.  అందుకే వీలైనంత వరకు మాస్ కు చేరువ కావడానికి మాస్ పాత్రలే ఎంచుకొని చేస్తుంటాడు.   రీసెంట్ గా ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ 3 సినిమాను ప్రారంభించాడు.  

దీనికి సంబంధించిన స్టైల్ ను సల్మాన్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోసం షేర్ చేశాడు.  సల్మాన్ వాక్ చేస్తున్న స్టిల్ అది.  షాడో లుక్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  సల్మాన్, అర్భాజ్ ఖాన్ లు సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు.  ఇండోర్ లో షూటింగ్ ప్రారంభమైంది.  సోనాక్షి సిన్హా హీరోయిన్.  వచ్చే ఏడాది ఈద్ కు ఈ సినిమా రిలీజ్ అవుతుంది.