దక్షిణాది సినిమాలు రీమేక్ చేయడం చాలా కష్టం 

దక్షిణాది సినిమాలు రీమేక్ చేయడం చాలా కష్టం 

సల్మాన్ ఖాన్ వాంటెడ్ సినిమా తరువాత బాలీవుడ్ లో తిరిగి గాడిన పడ్డారు.  వాంటెడ్ సినిమాకు ముందు సల్మాన్ నటించిన సినిమాలు వరసగా ఫెయిల్ అవుతూ వచ్చాయి.  తెలుగులో సూపర్ హిట్ అయ్యిన పోకిరి సినిమాను సల్మాన్ ఖాన్ వాంటెడ్ గా చేశారు.  ఈ సినిమా హిట్ కావడంతో తిరిగి వరసగా బాలీవుడ్ లో హిట్ కొట్టడం మొదలుపెట్టాడు.  

దక్షిణాదిన హిట్ కొట్టిన సినిమాలను సల్మాన్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు.  రీమేక్ సినిమాలకు ఎక్కువుగా ప్రభుదేవ దర్శకత్వం వహించడం విశేషం.  ప్రస్తుతం ఈ హీరో దబాంగ్ సీరీస్ లో వస్తున్న మూడో సినిమా దబాంగ్ 3 సినిమా చేస్తున్నారు.  ఈ సీరీస్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.  ఇప్పుడు మూడో సినిమా వస్తోంది.  డిసెంబర్ 20 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  హిందీతో పాటుగా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  కాగా, ప్రమోషన్స్ లో భాగంగా సల్మాన్ ఖాన్ చెన్నై వెళ్లారు.  అక్కడ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సల్మాన్ దక్షిణాది సినిమాల గురించి మాట్లాడుతూ.. దక్షిణాది భాషల్లో సినిమాలు నటించడం చాలా కష్టం అని, దక్షిణాది భాషల సినిమాలను రీమేక్ చేయడం చాలా కష్టం అని చెప్పారు.