రాజమౌళికి సల్మాన్ ఖాన్ సలహా !

రాజమౌళికి సల్మాన్ ఖాన్ సలహా !

 

రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్లో బిజీగా ఉన్నారు.  ముందుగా ఇందులో చరణ్ సరసన  అలియా భట్, ఎన్టీఆర్ పక్కన బ్రిటిష్ నటి డైసీఎడ్గార్‌ జోన్స్‌ అనుకున్నారు.  కానీ డైసీ ప్రాజెక్ట్ నుండి అనూహ్యంగా తప్పుకోవడంతో కొత్త నటిని వెతికే పనిలో ఉన్నాడు జక్కన్న.  ఇప్పటికే పలువురు బాలీవడు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.  ఇదిలా ఉండగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బ్రిటిష్ పోలికలుండే నటి జాక్వేలిన్ ఫెర్నాండేజ్ అయితే మీ సినిమాకు సరిపోతుందని, ఆమెను తీసుకోమని రాజమౌళికి సలహా ఇచ్చారట.  మరి ఈ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమో కాదు ఇంకా తెలియాల్సి ఉంది.  ఒకవేళ నిజమైతే రాజమౌళి సల్మాన్ సూచనను తీసుకుంటారో లేదో చూడాలి.