సల్మాన్ భారత్ ఎలా ఉందంటే...

సల్మాన్ భారత్ ఎలా ఉందంటే...

సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన భారత్ ఈరోజు రిలీజ్ అయ్యింది.  ఇప్పటికే యూఎస్ వంటి దేశాల్లో ప్రీమియర్ షోలు ముగిశాయి.  అక్కడి నుంచి అందుతున్న టాక్ ప్రకారం భారత్ లో సల్మాన్ నటన బాగుందని... సల్మాన్ జర్నీలో చూపించిన వేరియేషన్స్ ఆకట్టుకున్నాయని అంటున్నారు నెటిజన్లు.  కత్రినా కైఫ్ ఫస్ట్ టైమ్ అందంతో పాటు పెర్ఫార్మన్స్ తో కూడా ఆకట్టుకుందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.  న్యాచురల్ స్టైల్ నటన కట్టిపడేసింది.  

గతేడాది లాగా ఈ ఏడాది ఈద్ కు సల్మాన్ బెస్ట్ మూవీ అందిందించారని సల్మాన్ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్ రైటర్ తరుణ్ ఆదర్శ్ స్మాష్ హిట్ అని 4 ప్లస్ రేటింగ్ అని  ఇవ్వగా, కమల్ ఆర్ ఖాన్ మాత్రం మరో నాలుగు గంటల్లో అసలు నిజం బయటకు వస్తుందని అంటున్నాడు.