సల్మాన్ ఖాన్ బర్త్ డే స్పెషల్

సల్మాన్ ఖాన్ బర్త్ డే స్పెషల్

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన 54వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నాడు. తన చెల్లెలు అర్పిత, తన భర్త ఆయుష్‌ శర్మలు సల్మాన్‌ పుట్టినరోజుకు ఇ‍వ్వబోయే గిఫ్ట్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే నిండు గర్భవతైన అర్పితా, సల్మాన్‌ బర్త్‌డే రోజునే తన రెండో సంతానానికి జన్మనివ్వనుంది. దీంతో సల్మాన్‌ ఖాన్‌ ఖాందన్‌ లో ఇప్పటికే డబుల్‌ సెలెబ్రెషన్స్‌ ప్రారంభమయ్యాయి. ఇక సల్మాన్‌ ఖాన్‌ ఈ ఏడాది నుంచి తన పుట్టినరోజును స్పెషల్‌ పర్సన్‌తో షేర్‌ చేసుకోనున్నాడు. ఇక ఖాన్ బర్త్ డే సందర్భంగా ప్రతి ఏడాది బర్త్‌డే పార్టీని గ్రాండ్‌గా నిర్వహించినట్లుగానే.. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. సల్మాన్‌ తమ్ముడు సోహైల్‌ ఖాన్‌ ఇంట్లో పార్టీ జరుగనుండడంతో బాలీవుడ్‌ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున బర్త్‌డే వేడుకలకు హాజరుకానున్నారు. సల్మాన్‌ ప్రతీసారి పన్వేల్‌ లోని ఫాంహౌస్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాడు. అయితే ఈ సారి మాత్రం సల్మాన్‌ సోదరుడు సోహైల్‌ ఖాన్‌ ఇంట్లో బర్త్‌ డే వేడుకలు జరుగనున్నాయి.