నీటి వృధాపై సల్మాన్ కొత్త ప్రచారం..!!

నీటి వృధాపై సల్మాన్ కొత్త ప్రచారం..!!

ప్రస్తుతం ట్విట్టర్లో బాటిల్ క్యాప్ ఓపెన్ ఛాలెంజ్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.  బాటిల్ క్యాప్ ను కిక్ కొడుతూ ఓపెన్ చేయాలి. కిక్ కొట్టడం అన్నది ఒక్కొక్కరు ఒక్కో విధంగా లీడ్ చేస్తున్నారు.  సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరు ఈ బాటిల్ క్యాప్ ఓపెన్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు.  

సల్మాన్ కూడా బాటిల్ క్యాప్ ఓపెన్ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు.  దీన్ని కేవలం వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయడానికి మాత్రమే కాకుండా దీని ద్వారా ఓ మెసేజ్ ఇవ్వాలని అనుకున్నాడు.  దానికి తగ్గట్టుగా బాటిల్ క్యాప్ ను కాలితో కాకుండా నోటితో గట్టిగా ఊది ఓపెన్ చేశారు.  

బాటిల్ నీళ్లు తాగుతూ నీటిని వృధా చేయకండి.. నీళ్లను కాపాడుకుందాం అనే మెసేజ్ ను ఇచ్చారు.  ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాకు గట్టిగా తలిగిలింది.  మాములుగా ఎవరు చెప్తే ఆ ఏంటిలే వినేది అనుకుంటారు.  కానీ, ఒక టాప్ సెలెబ్రిటీ చెప్తే మాత్రం దానిని అందరు ఫాలో కావడానికి ట్రై చేస్తారు.  అలాగైనా నీటిని కాపాడుకుంటే భావితరాలకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి కదా.