సల్మాన్ దబాంగ్ 3 లో జగపతిబాబు..!!

సల్మాన్ దబాంగ్ 3 లో జగపతిబాబు..!!

దబాంగ్ సీరీస్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి.  ఈ రెండు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  ఫస్ట్ సినిమా తెలుగులో గబ్బర్ సింగ్ గా రీమేక్ అయింది.  పవన్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్.  దబాంగ్ 2 సినిమాను తెలుగులో మార్పులు చేసుకొని సర్దార్ గబ్బర్ సింగ్ గా వచ్చాడు పవన్.  ఇది ఇక్కడ పరాజయాన్ని చవిచూసింది.  

ఇదిలా ఉంటె ఇప్పుడు బాలీవుడ్ దబాంగ్ 3 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  సల్మాన్ ఖాన్ కు జోడిగా సోనాక్షి సిన్హా నటిస్తున్నారు.  ఫ్రాంచైజీలోని రెండు చిత్రాల్లోనూ సోనాక్షి నటించింది.  మూడో సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.  మరో ముఖ్యవిషయం ఏమిటంటే టాలీవుడ్ లో హీరో కంటే విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న జగపతిబాబు దబాంగ్ 3 లో ఓ మెయిన్ లీడ్ రోల్ చేయబోతున్నారు.  ఆయన రోల్ ఏమిటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.  ఓ రియల్ పోలీస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నది.  సల్మాన్ ఖాన్ కు వాంటెడ్ వంటి మంచి విజయాన్ని అందించిన ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.