వివాదంలో సల్మాన్ దబాంగ్ 3

వివాదంలో సల్మాన్ దబాంగ్ 3

సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఇండోర్ లో ప్రారంభమైంది.  సల్మాన్ పుట్టిన స్థలం ఇండోర్ కాబట్టి ఫస్ట్ షెడ్యూల్ అక్కడే చేయాలనీ యూనిట్ భావించి షూటింగ్ స్టార్ట్ చేసింది.  కాగా, ఇప్పుడు దబాంగ్ 3 వివాదంలో చిక్కుకుంది.  

షూటింగ్ సమయంలో సెట్స్ లో ఉన్న శివలింగాన్ని చెక్కల కింద ఉంచారని చెప్పి వివాదం రేగింది.  ఈ వివాదం పెద్దది కావడంతో చాలా పెద్ద గొడవ జరిగింది.  దీనిపై సల్మాన్ అండ్ కో వివరణ ఇచ్చింది.  షూటింగ్ చేసే సమయంలో శివలింగం పాడైపోకూడదని చెప్పి చెక్కలతో దానిని కప్పేశామని షూటింగ్ ముగిసిన వెంటనే తీసేస్తామని సల్మాన్ వివరణ ఇచ్చారు.