పవన్ ఫేవరేట్ సినిమా సీక్వెల్ మొదలైంది

పవన్ ఫేవరేట్ సినిమా సీక్వెల్ మొదలైంది

బాలీవుడ్ లో సూపర్ హిట్టైన దబాంగ్ సినిమాను టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.  ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కాగా, సెకండ్ పార్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ అయింది.  అక్కడ దబాంగ్ 2 కూడా ప్లాపైన సంగతి తెలిసిందే.  కాగా, ఇప్పుడు దబాంగ్ 3 సినిమాను సల్మాన్ ఖాన్ స్టార్ట్ చేశారు.  

ఇండోర్ లో సినిమా షూటింగ్ ఈరోజే ప్రారంభమైంది.  సౌత్ స్టార్ ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  సోనాక్షి సిన్హా హీరోయిన్.  వచ్చే ఏడాది ఈద్ కు ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  దబాంగ్ సీరీస్ ను టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసిన పవన్, మూడో సినిమా విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.  ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఒకవేళ సినిమాల్లోకి రాకుంటే.. దబాంగ్ 3 సీక్వెల్  నుంచే చేస్తారో లేదంటే బయట హీరోలు చేస్తారో చూడాలి.