కొత్త ఛానల్ ఆలోచనలో సల్మాన్

కొత్త ఛానల్ ఆలోచనలో సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారత్ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  ఈ ఏడాది ఈద్ కు సినిమా రిలీజ్ కానున్నది.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  రేస్ 3 పరాజయం తరువాత వస్తున్న సినిమా కావడం.. అదీ ఈద్ కు రిలీజ్ అవుతుండటంతో బజ్ క్రియేట్ అయింది.  ఈ సినిమాను సల్మాన్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థ ఎస్.కే.ఎఫ్ ఫిల్మ్ పతాకంపై నిర్మిస్తున్నాడు.   ఈ బ్యానర్ పై గతంలో సల్మాన్ ఖాన్ కొన్ని సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే.  అటు బుల్లి తెరపై కపిల్ శర్మసీజన్ 2 ను ప్రొడ్యూస్ చేశారు.  ఈ షో అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  

ఇప్పుడు సల్మాన్ సొంతంగా టీవీ ఛానల్ పెట్టె ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.  సల్మాన్ కొన్ని రియాలిటీ షోలను ప్లాన్ చేస్తున్నారు.  వీటితో పాటు మరికొన్ని షోలు కూడా చేసేందుకు సల్మాన్ సిద్ధం అవుతున్నాడు.  సొంతంగా ఛానల్ ను ప్రారంభించి ఆ ఛానల్స్ లో తాను నిర్మించే ప్రోగ్రామ్ లను ప్రసారం చేసే విధంగా సల్మాన్ ప్లాన్ చేస్తున్నాడట.