ఐపీఎల్ ఫైనల్ లో సల్మాన్, కత్రీనా సందడి 

ఐపీఎల్ ఫైనల్ లో సల్మాన్, కత్రీనా సందడి 

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా పేరుగాంచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ మరికాసేపట్లో టైటిల్‌ కోసం తలపడేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ ఆదివారం.. క్రికెట్‌ ప్రపంచమంతా హైదరాబాద్‌వైపే దృష్టి పెట్టింది. టైటిల్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌ అయిన ఫైనల్‌కు బాలీవుడ్ జంట సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ సందడి చేయనున్నారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగే మ్యాచ్ లో హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘భారత్‌’ జూన్‌ 5న విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రచారం చేసుకునేందుకు వాళ్లు టీవీ స్టూడియోలో కనిపించనున్నట్లు సమాచారం. మ్యాచ్‌కు ముందు నిర్వహించే కార్యక్రమంలో వాళ్లిద్దరూ పాల్గొననున్నారు.