బాలీవుడ్ కు కలిసిరాని ఈద్, దీపావళి..

బాలీవుడ్ కు కలిసిరాని ఈద్, దీపావళి..

ఈ ఏడాది రంజాన్, దీపావళి పండుగలకు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి.  ఈద్ రోజున సల్మాన్ ఖాన్ రేస్ 3 రిలీజ్ అయింది.  భారీ బడ్జెట్ తో తెరెకెక్కిన ఈ సినిమాను సల్మాన్ ఖాన్ సొంత ప్రొడక్షన్లో నిర్మించారు.  భారీ ఛేజింగ్ లతో లావిష్ గా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.  భారీ లాభాలు వస్తాయని అనుకుంటే.. దారుణం పరాజయం పాలైంది.  రీసెంట్ గా దీపావళికి అమితాబ్, అమీర్ ఖాన్ ల థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమా రిలీజ్ అయింది.  ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.  

ఫెస్టివల్ సీజన్లో వచ్చిన రెండు పెద్ద సినిమాలు పరాజయం పాలవ్వడంతో బాలీవుడ్ డీలా పడింది. విడి రోజుల్లో రిలీజైన బాహుబలి, సంజు, రాజీ, స్త్రీ, బదాయి హో వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి.  సినిమా కంటెంట్ బాగుంటే ఎప్పుడు రిలీజ్ చేసిన కలెక్షన్లు వస్తాయని ఈ సినిమాలు నిరూపించాయి.