పాక్ లో సల్మాన్ హవా..
సల్మాన్ ఖాన్ రేస్ 3 ఈద్ సందర్భంగా విడుదలైంది. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా అదే రేంజ్ లో ఉంటుందని అనుకున్నారు. కానీ, సినిమా విడుదల తరువాత కొంత నిరాసక్తిని కలిగించింది. క్రిటిక్స్ సైతం రేస్ కి వ్యతిరేకంగా వచ్చాయి. సల్మాన్ అభిమానులకు ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చినా.. వసూళ్ళ పరంగా మాత్రం దూసుకుపోతున్నది. రిలీజ్ కు ముందే లాభాలు ఆర్జించిన ఈ సినిమా రిలీజ్ తరువాత కూడా లాభాలు తెచ్చిపెట్టింది.
ఇకపోతే, బాలీవుడ్ సినిమాలు మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్ లో కూడా రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు అక్కడ బ్యాన్ అయినప్పటికీ బాలీవుడ్ లో అగ్రకతానాయకల సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. కరీనా, సోనం కపూర్ లు నటించిన వీరే ది వెడ్డింగ్ సినిమాను పాక్ లో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే, రేస్3 పాక్ లో ఈనెల 23 న బ్రహ్మాండంగా రిలీజ్ అయింది. సల్మాన్ కు పాక్ లో ప్యాన్స్ ఎక్కువ. రేస్ 3 రిలీజ్ అయిన మొదటి షో నుంచి కరాచీలో థియేటర్స్ ఫుల్ అయ్యాయట. ప్రేక్షకులు రేస్ 3 కి బ్రహ్మరధం పడుతున్నారు. ఇండియాలో ఒక వర్గమ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా పాక్ లో మాత్రం అందరిని ఆకట్టుకుంటోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)