సల్మాన్‌ ఖాన్‌ హత్యకు రెక్కీ!

సల్మాన్‌ ఖాన్‌ హత్యకు రెక్కీ!

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ హత్య కోసం  ఓ గ్యాంగ్‌స్టర్‌ ప్లాన్‌ చేసినట్లు హర్యానా పోలీసులు తెలిపారు. మే నెలలో సల్మాన్‌ నివాసం గలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో గ్యాంగ్‌స్టర్‌ లారెన్ష్ బైష్ణోయ్‌ ప్రధాన అనుచరుడు సంపత్‌ నెహ్రా రెక్కీ కూడా నిర్వహించిట్లు హర్యానా స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ తెలిపింది. హైదరాబాద్‌లోని మియాపూర్‌ బుధవారం పోలీసులకు చిక్కిన సంపత్‌ నెహ్రాకు సంబంధించిన కీలక వివరాలను టాస్క్‌ఫోర్స్ మీడియాకు వెల్లడించింది. మే నెల మొదటివారంలో ముంబైకు చేరుకున్న సంపత్‌ సల్మాన్‌ ఇంటిపై రెండుసార్లు రెక్కీ నిర్వహించాడు. సల్మాన్‌ కదలికలను ముఖ్యంగా ఫ్యాన్స్‌ కోసం బాల్కనీకి వచ్చే సమయం, ఇల్లు, బాల్కనీ, రోడ్డు మధ్య దూరాన్ని సంపత్‌ లెక్కవేశాడని, అతని నుంచి కీలక సమాచారం, ఫోటోలు లభించినట్లు పోలీసులు తెలిపారు. తమ పని పూర్తి చేసి విదేశాలకు రిపోవాలన్నది సంపత్‌ ప్లాన్‌. గ్యాంగ్‌స్టర్‌ బైష్టోయ్‌ జైలు నుంచే మొత్తం ప్లాన్‌ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.