సల్మాన్ కు అది చాలట..!!

సల్మాన్ కు అది చాలట..!!

సల్మాన్ ఖాన్ ఈరోజు 53 వ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.  ఈ వేడుకకు బాలీవుడ్ తారాగణం అంతా కదిలి వచ్చింది.  సల్మాన్ తన పనివల్ ఫామ్ హౌస్ లో బర్త్ డే వేడుకను జరుపుకున్నారు.  ఈ సందర్భంగా సల్మాన్ మీడియాతో మాట్లాడాడు. 

సెలబ్రిటీగా పేరు తెచ్చుకోవడానికి, స్టార్ డమ్ తెచ్చుకోవడానికి నాలుగు సినిమాలు హిట్టయితే చాలు.  సెలెబ్రిటీ కావొచ్చు.  ఇది ముఖ్యం కాదు.  ప్రజల మనసులో స్థానం సంపాదించడం ముఖ్యం అని.. ప్రజలు తనను తన వాడిగా ఆదరిస్తున్నారని.. అది చాలని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.  సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి.