మహర్షి రీమేక్ లో సల్మాన్?

మహర్షి రీమేక్ లో సల్మాన్?

మహర్షి మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సొంతం చేసుకుంది. నైజాంలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నది.  ఆంధ్రప్రదేశ్ లో కూడా వసూళ్లు నిలకడగా ఉన్నాయి.  ఈ సినిమా రిలీజ్ తరువాత మహేష్ బాబు సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నాడు.  ప్రెస్ మీట్, సక్సెస్ మీట్ లలో పాల్గొన్నాడు.  ఈరోజు విజయవాడలో జరిగే విజయోత్సవ సభలో మహేష్ పాల్గొంటున్నాడు.  అక్కడ ఏం మాట్లాడుతాడు అన్నది ఆసక్తికరంగా మారింది.  

ఇదిలా ఉంటె, మహేష్ మహర్షి సినిమా తమిళంలోనూ అటు హిందీలోనూ రీమేక్ చేయబోతున్నారని, తమిళంలో విజయ్, హిందీలో సల్మాన్ ఖాన్ ఈ సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి.  త్వరలోనే సల్మాన్ ఈ సినిమాను చూడబోతున్నారని కూడా వార్తలు రావడం విశేషం.