సల్మాన్ ఆమెను వివాహం చేసుకోబోతున్నారట ..!!

సల్మాన్ ఆమెను వివాహం చేసుకోబోతున్నారట ..!!

బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్లలో ఒకరు సల్మాన్ ఖాన్.  వయసు 50 దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.  పెళ్లి గురించి అడిగితె.. తనను పెళ్లి చేసుకుంటారా అని ఎవరు అడగలేదని చెప్పిన సంగతి తెలిసిందే.  కొన్నాళ్ల క్రితం సల్మాన్ పెళ్లి చేసుకోబోతున్నారని, ఓ విదేశీ అమ్మాయిని వివాహం చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.  కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.  

అయితే, ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్.. సల్మాన్ ను వివాహం చేసుకోబోతున్నట్టు చెప్పింది.  జరీన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.  ఆమెను నిజంగానే సల్మాన్ ఖాన్ వివాహం చేసుకోబోతున్నారు అనే ఆలోచిస్తే లేదని తేలింది.  మరి జరీన్ ఖాన్ అలా ఎందుకు చెప్పింది. దీనికి క్లారిటీ ఇచ్చింది.  ఇటీవలే జరీన్ ఖాన్ ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.  ఈ ఇంటర్వ్యూలో ఆమెకు ఓ టెస్ట్ పెట్టారట.  "మీపై మీరు రూమర్ సృష్టించుకోవాలి.. అది వైరల్ కావాలి" అది టెస్ట్.  దానికి జరీన్ ఖాన్.. తాను.. సల్మాన్ వివాహం చేసుకోబోతున్నామని చెప్పింది.  అలా ఆమె చెప్పిన కొద్దిసేపట్లోనే ఆ న్యూస్ వైరల్ గా మారింది.  జరీన్ ఖాన్ ను బాలీవుడ్ ఇండస్ట్రీకి సల్మాన్ పరిచయం చేశారు.