ఆర్ఆర్ఆర్ కోసం సల్మాన్ ఏం చేశారంటే...

ఆర్ఆర్ఆర్ కోసం సల్మాన్ ఏం చేశారంటే...

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.  రామ్ చరణ్ కు గాయం కారణంగా మూడు వారాల పాటు షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.  మరోవైపు ఎన్టీఆర్ కు జోడి అనుకున్న హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ కొన్ని కారణాల వలన పక్కకు తప్పుకుంది.  దీంతో ఎన్టీఆర్ కు మరో హీరోయిన్ వెతికే పనిలో పడ్డారు రాజమౌళి అండ్ కో.  

ఇప్పటికే అనేకమంది పేర్లను పరిశీలించారు.  కథ ప్రకారం ఎన్టీఆర్ కు హాలీవుడ్ హీరోయిన్ ఉండాలి.  ఇప్పుడు హాలీవుడ్ నుంచి మరో హీరోయిన్ ను తీసుకురావాలి అంటే చాలా సమయం పడుతుంది.  అందుకే ఇండియన్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు.  అయితే, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన స్నేహితురాలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును రాజమౌళికి సూచించినట్టు తెలుస్తోంది.  జాక్వెలిన్ విదేశీ అమ్మాయి కావడంతో పాటు చేసేందుకు బ్రిటిష్ యువతిలా ఉంటుంది కాబట్టి ఆమె పేరును సూచించారట సల్మాన్.  ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉండనే విషయం తెలియాలి.  ఒకవేళ సల్మాన్ రిఫరెన్స్ ను రాజమౌళి ఓకే చేస్తే ఇద్దరు హీరోయిన్లు బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళే అవుతారు.