పాట రాసి.. పాడిన సల్మాన్
Apr 18, 2018 01:13 PM
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ తనలోని మరో టాలెంట్‌ను బయటకు తీశాడు. గతంలో పెయింటర్‌గా మారి ఆశ్చర్యపర్చిన సల్మాన్.. ఓ సినిమాలో పాట కూడా పాడాడు. ఇప్పుడు.. 'రేస్-3' సినిమా కోసం పాటల రచయితగా మారాడు. అంతే కాదు ఇదే సినిమాలో ఓ పాట కూడా పాడాడు. ఈ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను వేరే పాటల రచయిత చేత రాయించాలని చిత్ర యూనిట్ భావించగా.. తాను రాసిన పాట ఉందని చెప్పి చదివి వినిపించాడట సల్మాన్. వారికి కూడా నచ్చడంతో ఆ పాటనే సినిమాలో వినియోగించాలని నిర్ణయించారట.
వెంటనే ఆ పాటను సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా కంపోజ్ చేసి ప్రొఫెషనల్ సింగర్స్‌తో పాడించారట. 'పాట చాలాబాగా రాశావ'ని యూనిట్ అభినందించడంతో ఇదే సినిమాలో ఓ పాట పాడతానని చెప్పడంట సల్మాన్. ఎగిరి గంతేసిన దర్శక నిర్మాతలు.. వెంటనే ఓ పాటను సల్మాన్ చేత పాడించారట. సల్మాన్ ఓ పాట రాయడంతోపాటు మరో పాట పాడడంతో డబుల్ ధమాకా ఖాయమని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)