100 కోట్లు కొల్లగొట్టడం ఇది 14వ సారి

100 కోట్లు కొల్లగొట్టడం ఇది 14వ సారి

 

సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.  ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల వసూళ్లను క్రాస్ చేసినట్టు తెలుస్తోంది.  దీంతో సల్మాన్ ఖాతాలో 14వ 100 కోట్ల సినిమా చేరినట్టైంది.  గతంలో భాయ్ నటించిన దబాంగ్, ఏక్ తా టైగర్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, దబాంగ్ 2, టైగర్ జిందా హై, రెడీ, బాడీ గార్డ్, జయహో, భజరంగి భాయ్ జాన్, కిక్, ట్యూబ్ లైట్, సుల్తాన్, రేస్ 3 వంటి సినిమాలన్నీ 100 కోట్లకు పైగానే వసూళ్లను సాధించాయి.  ఇది సల్మాన్ కెరీర్లోనే అరుదైన రికార్డ్ అని చెప్పొచ్చు.  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన 'భారత్'లో కత్రిన కైఫ్ కథానాయకిగా నటించడం జరిగింది.