సల్మాన్ 'ఇన్షా అల్లా' రిలీజ్ డేట్ !

సల్మాన్ 'ఇన్షా అల్లా' రిలీజ్ డేట్ !

 

ఈ ఏడాది రంజాన్ సందర్బంగా 'భారత్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు సల్మాన్ ఖాన్.  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించి విజయం దిశగా దూసుకుపోతోంది.  దీంతో సల్మాన్ తన కొత్త సినిమా 'ఇన్షా అల్లా' విడుదల తేదీని కూడా ఫైనల్ చేశారు.  వచ్చే ఏడాది ఈద్ సందర్బంగా ఈ చిత్ర రిలీజ్ కానుంది.  ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడి సంజయ్ లీలా బన్సాలి డైరెక్ట్ చేయనున్నారు.  సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలో రూపొందనున్న ఈ చిత్రంలో అలియా భట్ కథానాయికగా నటించనుంది.  2007లో వచ్చిన 'సావరియా' తర్వాత సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా బన్సాలీలు కలిస్ చేస్తున్న చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.