అమీర్ రికార్ట్ బ్రేక్.. టాప్ లిస్ట్ లో సల్మాన్..

అమీర్ రికార్ట్ బ్రేక్.. టాప్ లిస్ట్ లో సల్మాన్..

అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే.  దంగల్ సినిమాకు మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల్లో కూడా మంచి ఆదరణ లభించింది.  ఈ సినిమా దాదాపుగా రూ 2000 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.  ఇక శాటిలైట్ రూపంలో దంగల్ ను జీ నెట్వర్క్ సంస్థ రూ.120 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.  ఇప్పటి వరకు ఇదే రికార్డ్.  దీని తరువాత రజినీకాంత్ రోబో 2.ఓ ఉన్నది.  కాగా, ఇప్పుడు ఈ రెండు రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ సల్మాన్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చాడు.  

సల్మాన్ ఖాన్ నటించి నిర్మిస్తున్న రేస్ 3 సినిమా శాటిలైట్ రైట్స్ రూ.130 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.  అంటే సినిమా బడ్జెట్ లో సింహభాగం శాటిలైట్ హక్కుల రూపంలో వచ్చేసింది.  థియేట్రికల్ రూపంలో వచ్చేవి లాభాలుగానే చెప్పుకోవచ్చు.  రేస్ 3 సినిమా రంజాన్ సందర్భంగా ఈనెల 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది.  సినిమా విడుదలకు ముందే శాటిలైట్ రూపంలో దంగల్ రికార్ట్ బ్రేక్ చేసిన సల్మాన్, సినిమా విడుదల తరువాత మరెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.