స‌ల్మాన్ భాయ్ 3డి విజువ‌ల్ ట్రీట్‌

స‌ల్మాన్ భాయ్ 3డి విజువ‌ల్ ట్రీట్‌

కొరియోగ్రాఫ‌ర్ & డైరెక్ట‌ర్‌ రెమో.డి.సౌజా దర్శకత్వం వ‌హిస్తున్న‌`రేస్ 3` ఈద్ కానుక‌గా రిలీజ్‌కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. స‌ల్మాన్ ఖాన్‌, జాక్విలిన్ ఫెర్నాండెజ్‌, అనీల్ క‌పూర్ వంటి స్టార్లు ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా అభిమానుల్లో హీట్ పెంచాయి. రేస్ 3 మునుపటి రెండు భాగాల్ని మించి అద్భుత‌మైన క‌థ‌, ట్విస్టుల‌తో తెర‌కెక్కుతోంద‌న్న టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో స్పైసీ కంటెంట్ పీక్స్‌లో ఉంటుందని చెబుతున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మ‌రో వేడెక్కించే వార్త‌ను త‌ర‌ణ్ ఆద‌ర్శ్ చెప్పారు. రేస్ 3 చిత్రం 2డితో పాటు 3డిలోనూ రిలీజ్ కానుంది అన్న‌దే ఆ వార్త సారాంశం. రేస్‌1, రేస్ 2 చిత్రాలు కేవ‌లం 2డి వెర్ష‌న్లు. కానీ ఈసారి రేస్ సిరీస్ అభిమానుల‌కు అంత‌కుమించిన విజువ‌ల్ ట్రీట్ ఇచ్చేందుకు `రేస్ 3`ని 3డిలో రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు ముంబైలో 3డి ట్రైల‌ర్ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.