ఉప్పుతో పెట్టుకుంటే... ప్రాణాలకే ముప్పు... 

ఉప్పుతో పెట్టుకుంటే... ప్రాణాలకే ముప్పు... 

ఉప్పు శరీరానికి అవసరమైన మూలకమే.  అయితే, ఉప్పును ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి.  అంతకు మించి వాడితే ఇబ్బందులు వస్తాయి.  ఉప్పును అధికంగా తీసుకునే వాళ్లకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని బ్రిటిష్ జర్నల్ పేర్కొన్నారు.  ఉప్పును సోడియం క్లోరైడ్ పేరుతో పిలుస్తారు.  దీనిని ఆహారంతో కొద్దిగా తీసుకుంటే మంచిదే.  అంతకు మించే విధంగా తీసుకుంటేనే ప్రాణాలు ముప్పు వాటిల్లుతుంది.  

ఉప్పును అధికంగా తీసుకునే వ్యక్తుల రక్తనాళాలు, శరీరంలో సోడియం నిల్వలు పేరుకుపోతాయి.  ఇలా సోడియం నిల్వలు పేరుకుపోవడం వలన చాలా ఇబ్బందులు వస్తాయి.  రక్తనాళాల్లో సోడియం నిల్వలు పేరుకుపోతే... తద్వారా అది గుండె పోటుకు దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  శరీరానికి ఎంత తక్కువగా ఉప్పును అందిస్తే అంత మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు.