ఐపీఎల్ లో కొత్త రికార్డు నెలకొల్పిన కర్రన్, తాహీర్...

ఐపీఎల్ లో కొత్త రికార్డు నెలకొల్పిన కర్రన్, తాహీర్...

ఐపీఎల్ 2020 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై ఎంతలా విఫలమయ్యిందో అందరికి తెలుసు. అయిన కూడా చెన్నై ఆటగాళ్లు సామ్ కర్రన్, ఇమ్రాన్ తాహీర్ కలిసి ఓ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాట్స్మెన్స్ అందరూ వరుసగా పెవిలియన్ కు చేరుకున్నారు. ఇందులో 71 పరుగుల వద్ద చెన్నై 8వ వికెట్ కోల్పోయింది.. అయితే అప్పటికి గ్రౌండ్ లో నిలదొక్కుకున్న కర్రన్ కు తోడుగా తాహీర్ వచ్చాడు. వీరిద్దరూ చివరి వరకు వికెట్ పడకుండా కాపాడారు. కానీ మ్యాచ్ చివరి బంతికి కర్రన్ ఔట్ అయ్యాడు. అప్పటికి తొమ్మిదవ వికెట్ కు ఈ ఇద్దరు కలిసి 43 పరుగుల భాగసౌమ్యం నెలకొల్పారు. దాంతో  ఇప్పటివరకు ఐపీఎల్ అన్ని సీజన్ లలో తొమ్మిదవ వికెట్ కు అత్యధిక పరుగుల భాగసౌమ్యం నెలకొల్పిన వారిగా కర్రన్, తాహీర్ రికార్డు సృష్టించారు. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై ఇచ్చిన 114 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఒక్క వికెట్ కోల్పోకుండా చేధించింది.