ధోని వద్దనుండి నేను దానిని ఊహించలేదు...

ధోని వద్దనుండి నేను దానిని ఊహించలేదు...

చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో ఒక వికెట్ తీసిన కర్రన్ 6 బంతుల్లో 18 పరుగులు చేసాడు. అందులో ఒక ఫోర్ రెండు సిక్స్లు ఉన్నాయి. ఇక 121 పరుగుల వద్ద మూడో వికెట్ గా రవీంద్ర జదేహ వెనుదిరగ్గానే కర్రన్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ విషయం పై తాజాగా స్పందించిన కర్రన్ మాట్లాడుతూ... నేను మా కెప్టెన్ ధోని వద్దనుండి దానిని అసలు ఊహించలేదు. జడేజా ఔట్ కాగానే నన్ను బ్యాటింగ్ కు వెళ్లామన్నారు. దాంతో నేను షాక్ అయ్యాను అంటూ కర్రన్ చెప్పాడు. ఇక ఈ యువ ఆటగాడిని తన కంటే ముందు పంపడం గురించి ధోని వివరిస్తూ... కర్రన్ స్వభావం ఎలాంటిది అంటే అతను కొడితే బాల్ బౌండరీ వెళ్ళాలి లేదా తాను పెవిలియన్ కు రావాలి అన్నట్లుగా ఆడుతాడు. అందుకే తనని ముందు పంపిస్తే పరుగులు వేగంగా చేస్తాడు, లేదా తిరిగి వస్తాడు. అంతే కానీ బంతులు వృధా చెయ్యడు. అయితే నేను అనుకున్న విధంగానే అతను ఆడాడు అని ధోని చెప్పాడు,