అల వైకుంఠపురంలో 'సామజవరగమనా' అంటూ రికార్డు సృష్టించారు !

అల వైకుంఠపురంలో 'సామజవరగమనా' అంటూ రికార్డు సృష్టించారు !

 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి విడుదలైన పాట సంచలనాలు రేపుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని సామజవరగమన పాట యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఈ పాట రిలీజయిన కొన్ని రోజుల పాటు యూ ట్యూబ్‌లో నెం1 గా ట్రెండింగ్ అయ్యింది. అలా అల వైకుంఠపురములో సామజవరగమన పాట విడుదలైన క్షణం నుంచి సంచలనాలు రేపుతూనే ఉంది.

ట్యూన్ క్యాచీగా ఉండటంతో ప్రేక్షకులు ఈ పాటను బాగా ఆదరిస్తున్నారు. సిరివెన్నెల సాహిత్యానికి.. సిడ్ శ్రీరామ్ వాయిస్ ప్రాణంగా నిలిచింది. ఇక తమన్ మ్యూజిక్ కూడా బాగా కలిసొచ్చింది. ఈ పాట విడుదలైన రెండు రోజుల్లోనే కోటి వ్యూస్ సాధించింది. ఇక లైక్స్‌లో కూడా సామజవరగమన సాంగ్ సంచలనాలు రేపుతుంది. తాజాగా దీనికి 700,000 లైకులు వచ్చాయి. ఇప్పటి వరకు తెలుగు పాటల్లో ఈ స్థాయి రికార్డు లేదు. మరికొన్ని రోజులు ఇదే దూకుడు కొనసాగితే ఈ బన్నీ సినిమా సాంగ్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.