టికెట్లు చింపుతున్న సమంత !

టికెట్లు చింపుతున్న సమంత !

స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంతలు కలిసి 'మజిలీ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  పెళ్ళైన తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది ఉంది.  ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ సింహాచలంలో జరుగుతోంది. 

తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో సమంత రైల్వేలో టికెట్ బుకింగ్ క్లర్క్ పాత్రలో నటించనుందని తెలుస్తోంది.  'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్దిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.