నాగ్ సినిమాలో సమంత ?

నాగ్ సినిమాలో సమంత ?

 

కింగ్ నాగార్జున ప్రస్తుతం 'మన్మథుడు 2' పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై మంచి అంచాలున్నాయి ప్రేక్షకుల్లో.  ఇందులో నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది.  తాజా వార్తల మేరకు ఈ సినిమాలో నాగార్జున కోడలు, స్టార్ హీరోయిన్ సమంత ఒక చిన్న పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది.  మరి ఈ వార్తల్లో నిజమేంత అనేది చిత్ర యూనిట్ నోరు విప్పితేనే తెలుస్తుంది.  ఇకపోతే ఈమధ్య కాలంలో పెద్దగా విజయాలేవీ లేని నాగ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.