నాగ చైతన్యతో ఢీ అంటే ఢీ అంటున్న సమంత !

నాగ చైతన్యతో ఢీ అంటే ఢీ అంటున్న సమంత !

నాగ చైతన్య కొత్త సినిమా 'శైలజారెడ్డి అల్లుడు' ఈ నెల 31న విడుదలవాల్సి ఉండగా పనులు పూర్తి కానందున వాయిదాపడి సెప్టెంబర్ 13కు వెళ్ళింది.  ఇక సమంత నటించిన 'యు టర్న్' కూడ అదే సెప్టెంబర్ 13న విడుదలకానుంది.  

కొన్ని రోజుల క్రితం సమంత 'యు టర్న్' విడుదల తేదీని సోమవారం ప్రకటిస్తాను అనగా అందరూ సెప్టెంబర్ 13న చై సినిమా ఉంది కాబట్టి ఆరోజున కాకుండా ఇంకో వారం తరవాత సమంత సినిమా  ఉంటుందని అనుకున్నారు.  కానీ సమంత మాత్రం 13నే సినిమా ఉంటుందని ఈరోజు అనౌన్స్ చేశారు.  దీన్నిబట్టి ఆమె తన భర్తతో ముఖాముఖి పోటీకి దిగడానికి ఏమాంత్రం సందేహించడంలేదని అర్థం అవుతోంది.